KTR: ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో A1 గా కేటీఆర్ ..! 3 d ago
TG : ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 120బి, 409 కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు. RBI గైడ్లైన్స్ కు విరుద్ధంగా ఎస్ఈవో కంపెనీకి రూ.45 కోట్లు HMDA చెల్లించిందని కేసులు పెట్టారు. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్టు కేటీఆర్ పై అభియోగాలు మోపడ్డాయి.
కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.8కోట్ల ఫైన్ వేసింది. అధికారంలోకి వచ్చాక RBIకి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.8 కోట్లు చెల్లించింది. అయితే, కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, కేటీఆర్ ఆదేశాలతో నిధులు IAS అరవింద్ కుమార్ చెల్లించారని పేర్కొంది. HMDA చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసింది. ఈ మొత్తంగా కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ స్పష్టం చేసింది.